ఆ సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్ళు కావస్తోంది.అయినా ఇప్పటికీ ఆ సినిమాని ప్రేక్షకులు మర్చిపోలేదు. ముఖ్యంగా అందులో ఓ మూడు పాత్రలు మాత్రం అందరి మనసులో ఉండిపోయాయి.ఆ సినిమానే 'బొమ్మరిల్లు'.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెనీలియా,సిద్ధార్థ ఈ ముగ్గురి చుట్టూనే సినిమా అంతా ఉంటుంది. అందులో జెనీలియా పాత్ర చిత్రణ అయితే ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది.