నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీ విడుదపై చర్చించేందుకు శుక్రవారం మధ్యాహ్నం థియేటర్ల యాజమాన్యం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా థియేటర్ యజమానులు మాట్లాడుతూ.."నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ విడుదల రోజే నాని టక్ జగదీష్ సినిమాని..  ఓటీటీ లో విడుదల చేస్తే అందరం నష్టపోతామని అన్నారు.సినిమా లేకుండా మనం లేమని,సినిమా మన సంస్కృతి లో భాగమని నాని అన్నాడు.కానీ ఇప్పుడేమో తన సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాడు.నాని కేవలం సినిమాల్లోనే హీరో కానీ.. నిజ జీవితంలో మాత్రం ఓ పిరికివాడు' అని పేర్కొన్నారు.