భీమ్లా నాయక్ సినిమాలో రానా పాత్రని హైలైట్ చేయడం లేదని,కేవలం పవన్ కళ్యాణ్ పాత్రని మాత్రమే హైలెట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక అందుకు తగ్గట్టే భీమ్ నాయక్ గ్లిమ్స్ లో రానా ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. దీంతో ఒకవైపు రానా అభిమానులు, మరోసారి సినిమా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో ఈ టీజర్ రాజేసిన మంట ఇంకా చల్లారలేదనే చెప్పాలి.అయితే ఇప్పుడు ఆ మంటను చల్లార్చడానికి ఆయింట్ మెంట్ ను రెడీ చేయిస్తోందట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ..