టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి శిష్యులలో డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఒకడు.మన జక్కన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా,అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన నితిన్ హీరోగా తెరకెక్కిన 'ద్రోణ' సినిమాతో వెండితెరకు దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు.అయితే తాజాగా కరుణ కుమార్ ఓ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. తన గురువు అయిన రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.