మన హీరోలు ఏదైనా చిన్న హీరో సినిమా విడుదలై థియేటర్ల లో బాగా ప్రదర్శింపబడుతూ ఉంటే ,ఆ సినిమాను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిగా సినిమాను చూసి సినిమా బాగున్నట్లయితే వారి ఉద్దేశాలను న్యూస్ ఛానల్ ద్వారానో లేదా సోషల్ మీడియా ద్వారానో తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ సినిమా గురించి పొగడ్తల వర్షం కురిపించాడు.