తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పిలుపునిచ్చారు చిరంజీవి.తన పుట్టినరోజున అభిమానులందరూ"గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు.ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.