ఆచార్య రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్.. దీని తరువాత త్వరలో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబంధించి మిగిలిన ఎపిసోడ్ల షూటింగ్ చేయనున్నారు.ఇక దాని అనంతరం కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.  అయితే అక్టోబర్ నెల నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని అంటున్నారు కొరటాల శివ.