బంగార్రాజు సినిమాలో మొదటి పార్ట్ ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు ఒకింత ఎక్కువగానే ఖర్చు చేయనున్నారట నాగ్.ఈ సినిమాలో విజువల్ ఎఫెప్ట్,గ్రాండియర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని,వాటి విషయాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని అంటున్నారు.