ఎన్టీఆర్ ను కించపరిచే పాత్ర చేసినందుకు సినీరంగంలోని ఎన్టీఆర్ అనుకూల వర్గం దాదాపుగా కోటను వెలవేసినంతపని చేసిందట. అంతే కాదు.. ఓసారి విజయవాడ వెళితే.. ఎన్టీఆర్ అభిమానులు కోటాను వెంటపడి తరిమి మరీ కొట్టారట.. అలా ఆ పాత్ర కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డానని కోట తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.