చిరు ,బాబీ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో చిరుని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గత సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రను పోషించారు.నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో జగపతిబాబు మంచి నటనను కనబర్చాడు.ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో జగపతిబాబు కి ఛాన్స్ దక్కిందని ఇండ్రస్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.