'బంగార్రాజు' లో నాగ్ తనయుడు అక్కినేని నాగ చైతన్య సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయనకు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఇదిలా ఉంటె నిజానికి నాగ్ చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేయాల్సి ఉంది..కానీ ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా షెడ్యూల్స్ తో బిజీగా ఉండటంతో పాటు పలు ఇతర దర్శకుల నుండి కూడా తన నెక్స్ట్ సినిమాల కథలు వింటూ తీరిక లేకుండా సమయం గడుపుతున్నాడట.