ముఖ్యంగా మెగా క్యాంప్ సినిమాల్లో కచ్చితంగా అనసూయ ఉంటోంది.ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో భారీ ఆఫర్ ని పట్టేసింది ఈ భామ.తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తుందట.ఈ విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆమె స్వయంగా వెల్లడించింది..