లవ్ స్టోరీ సినిమాకి మరో సమస్య వచ్చి పడింది.తాజాగా జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన తలైవి సినిమాని సెప్టెంబర్ 10 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.దీంతో లవ్ స్టోరీ సినిమాకి తలైవితో తలనొప్పి తప్పేలా లేదు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత తొలి పాన్ ఇండియా మూవీగా తలైవి రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో చైతూ లవ్ స్టోరీ సినిమాకి తలైవి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది.తలైవి రిలీజ్ వల్ల లవ్ స్టోరీ కలెక్షన్స్ కొంతమేర తగ్గే అవకాశం ఉంది.