టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు నటించిన 'అనుకోకుండా ఒకరోజు'అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యింది బేబీ అన్ని.ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.ఇక ఈ చిన్నారి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మహేష్ బాబు,నందమూరి బాలకృష్ణ,రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జున నటించిన రాజన్న, రామ్ చరణ్ రంగస్థలం సినిమాలతో బేబీ అన్ని కి మంచి గుర్తింపు వచ్చింది.