కరోనా సెకండ్ వేవ్ పోయి చాలా రోజులు అవుతున్న సినిమా థియేటర్లు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు.సెకండ్ వేవ్ తర్వాత కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సి తో థియేటర్లు ఓపెన్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.. ఇక తమిళనాడులో అయితే ఈ నెల 23 నుంచి 50 శాతం ఆక్యుపెన్సి తో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి..ఇక ఈ విషయం పక్కన పెడితే. ఈ ఏడాది చివర డిసెంబర్ నాటికి పరిస్థితులు కుదుటపడతాయని సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్స్,ఎగ్జిబిటర్స్ భావిస్తూ.. ఆ నెలలో తమ తమ సినిమాలకు చెందిన విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించేశారు.