టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా కనీసం బ్రేక్ కూడా లేకుండా వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడట బన్నీ.ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు బన్నీ.రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే గతంలో ఆగిపోయిన 'ఐకాన్' ప్రాజెక్ట్ ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.కనీసం మధ్యలో బ్రేక్ తీసుకోవాలని కూడా బన్నీ అనుకోవట్లేదట.