దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత ప్రత్యేకమైన మనిషో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరికీ భయపడకుండా తన మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా చెప్పడం రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ. తాను దర్శకత్వం వహించిన సినిమాలు కూడా తనకు నచ్చిన విధంగా ఉండడానికి మాత్రమే రామ్ గోపాల్ వర్మ ఇష్ట పడుతూ ఉంటాడు. ఇక తన సినిమాల్లో హీరోయిన్ గా నటించే వారి విషయంలో మరియు రాంగోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసే వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారో కూడా మనందరికీ తెలిసిందే. ఎదురుగా అమ్మాయి కూర్చుని ఉంటే ఆ అమ్మాయి పై ఎలాంటి ఫీలింగ్ ఉందో నిర్మొహమాటంగా చెప్పే తత్వం ఈ దర్శకుడిది.