సినీ ఇండస్ట్రీకి చెందిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి రంగం సిద్ధమైంది.అక్టోబర్ 10 వ తేదీన ఈ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు 'మా' అధ్యక్షుడు నరేష్ తాజాగా అధికారికంగా ప్రకటించారు...'అధ్యక్ష పదవి పోటీలో మేం ఉన్నాం' అంటూ చాలా మంది నటులు ప్రకటించారు.మరి ఇందులో ఎవరు ఈ బరిలో ఉంటారు, ఎవరు బయటికి వచ్చేస్తారు అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.