బిగ్ బాస్ ఐదవ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అంతా ఆగస్ట్ 26 నుండి కోవిడ్ ప్రోటోకాల్స్ లో భాగంగా క్వారంటైన్ లో ఉంచడానికి అన్నీ సిద్ధం చేసారట. తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి కోవిడ్ టెస్ట్ చేయగా, వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా పలు మీడియా సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.