టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన 'చలో' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా 'భీష్మ' అనే సినిమాకు దర్శకత్వం వహించి మరోసారి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇలా తీసిన రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో మూడో సినిమా ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేయాలని వెంకీ కుడుముల ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ దర్శకుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలవడంతో ఆ వార్తలు నిజమే కావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మామూలుగా చిరంజీవి ఏదైనా సినిమా చూస్తే ఆ సినిమా నచ్చినట్లయితే, ఆ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉంటారు. అలాగే 'బీష్మా' సినిమా మా మంచి విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.