గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సీటీమార్'.ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన కొన్ని పోస్టర్లు మరియు టీజర్లు, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి మంచి స్పందన కూడా లభించింది. హీరో గోపీచంద్ మరియు హీరోయిన్ తమన్నా ఇద్దరు ఈ సినిమాలో కబడ్డీ టీం కోచ్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో పలు మార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది.