సుశాంత్ ని అందరూ మర్చిపోతున్న సమయంలో 'చి. ల. సౌ.'అనే సినిమా ఈ హీరోకి మళ్ళీ హోప్ ఇచ్చింది.రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి సుశాంత్ కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యింది. అయితే ఈ సినిమా వల్లనే సుశాంత్ కి త్రివిక్రమ్, బన్నీ ల కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠ పురంలో' సినిమాలో అవకాశం వచ్చిందట.అయితే ఈ విషయాన్ని తన కొత్త సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.