తెలుగు సినిమా పరిశ్రమలో మళ్ళీ చాలా రోజుల తర్వాత సినిమాల సందడి కనిపించనుంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త పేరున్న సినిమాలతో మొదలైన ఈ సందడి...ఇప్పుడు పెద్ద సినిమాల వరకు వచ్చింది.ఇక ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే సినిమా సందడి షురూ కానుంది. అప్పుడే పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి.మొదట సెప్టెంబర్ 3 న యాక్షన్ హీరో గోపిచంద్ సీటీమార్ వస్తోంది.ఇక ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి.