ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది 2022 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. దసరాకి సినిమాని రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ సినిమా మేకర్స్ దసరా సీజన్ పై దృష్టి పెట్టినట్లు ఇండ్రస్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.