సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రముఖ నటుడు, నిర్మాత, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త చెప్పారు.పవన్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు బండ్ల గణేష్.ఈ క్రమంలో ఫ్యాన్స్ కి తెలియజేస్తూ.. దయచేసి మీరందరూ థియేటర్ బుక్ చేసుకోవాలని ఫ్యాన్స్ కి సూచించారు.