తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతి కి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటికే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట.. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ని అఫీషియల్ గా ఫిక్స్ చేసుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతికి రిలీజ్ అయితే కనీసం రెండు సినిమాలు వెనక్కి తగ్గి,రిలీజ్ డేట్స్ ని కచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మరోవైపు ఆచార్య సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.