దసరా కానుకగా అక్టోబర్ 8 న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే అదే అక్టోబర్ 8 వ తేదీన.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన.. రెండవ సినిమా 'కొండపొలం' సినిమా కూడా విడుదల కానుంది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా రూపొందించారు. దీంతో అక్టోబర్ 8 న మెగా, అక్కినేని హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.