తాజాగా శ్రీ విష్ణు సరసన 'రాజ రాజ చోర' సినిమాతో మొదటి హిట్ అందుకుంది మేఘా ఆకాష్.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో సినిమాతో రావడానికి రెడీ అయిపోయింది ఈ హీరోయిన్. అరుణ్ అధిత్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ మేఘా'.త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మేఘా ఆకాష్.ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.