'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడిగా కనిపించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇదిలా ఉంటె ప్రభాస్ తన కెరీర్లో ఆదిపురుష్ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్రలో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'యమదొంగ' సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లో తీసారు.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏదైనా చేద్దామని అనుకున్నారు రాజమౌళి.అప్పుడు ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించారు.