అప్పట్లో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారి 'జానీ' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్ గానే కాకుండా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకోవడంతో పాటూ తానే హీరోగా నటించాడు.అయితే ఈ సినిమా చివరికి పవన్ కి నిరాశే మిగిల్చింది.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.  కానీ ఆ తర్వాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా కోసం పవన్ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు.