'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇద్దరు హీరోలు తమ గెటప్స్ ని మార్చుకుంటారేమోనంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంలో తారక్, చరణ్ ఇద్దరికి ఓ కండీషన్ పెట్టారట రాజమౌళి.తను చెప్పే వరకు గెడ్డాలు తీయవద్దని దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలకు క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి టోటల్ అవుట్ పుట్ ని తాను చూసి,ఓకే అనుకునే వరకు గెటప్ చేంజ్ చేయకుండా గెడ్డాలతోనే ఉండాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది..