అయ్యప్పనున్ కోషియం లో అయ్యప్పనున్ పాత్ర ఎప్పుడూ పాన్ నమలడంతో పాటూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తుంది.అయితే పవన్ కళ్యాణ్ ని సైతం తెలుగులో అదే విధంగా చూపిస్తే మాత్రం ఫ్యాన్స్ కి నచ్చకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినీ నటుడే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా.అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సీన్స్ వస్తే కచ్చితంగా ఆయనపై ఓ నెగిటివ్ టాక్ అనేది వస్తుంది.