తాజాగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.3 కోట్లు అంటే 13 మిలియన్లు దాటిందని ఓ పోస్ట్ పెట్టి ఘనంగా చెప్పాడు బన్నీ.అయితే బన్నీ తర్వాత టర్న్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండది.అయితే బన్నీ తాజాగా ఆ పోస్ట్ పెట్టే సమయానికి ఆయనకు 1,30,12,871 మంది ఫాలోవర్స్, అలాగే విజయ్ దేవరకొండకి 1,29,78,835 మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈ క్రమంలో ఒకటి లేదా మరో రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య కూడా 13 మిలియనన్లు కాబోతుంది.