ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదవ సీజన్ పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మరి సీజన్ 5 ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రశ్నకి నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.