ప్రస్తుతం హౌస్ టూర్ ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా తారలు...సోషల్ మీడియా సెలబ్రెటీలు తమ ఇంటిని చూపిస్తూ ఎక్కడెక్కడా ఏం ఉన్నాయో చెబుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు హోం టూర్ ల పేరుతో తమ ఇల్లను చూపించారు. ఇటీవలే మంచు లక్ష్మి కూడా తన ఇంటిని చూపిస్తూ హోం టూర్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్య్వూవ్స్ రావడంతో మంచు లక్ష్మి ఎంతో కుషీ అయ్యింది కూడా. ఇక అంతా హోం టూర్ లు చేస్తుంటే శ్రీరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. శ్రీరెడ్డి బాత్రూం టూర్ అంటూ వీడియోలు చేస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. శ్రీరెడ్డి బాత్రూం టూర్ ను సిరీస్ లుగా వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోంది.