తాజాగా మరోసారి వర్మ అష్షు రెడ్డి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో దుమారం రేగుతోంది. సీక్రెట్ ప్లేస్ లో అష్షు పవన్ కల్యాణ్ పేరును టాటూ గా వేసుకోవడం పై కొంత మంది నెటిజన్లు మండి పడుతూ వర్మ పోస్ట్ కు కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీ అమ్మ ఈ ఫోటో చూస్తే ఎలా అంటూ కామెంట్ చేశాడు. దానిపై స్పందించిన అష్షు రెడ్డి మా అమ్మనే ఈ ఫోటోను తీసింది. నీకేమన్నా ప్రాబ్లమా అంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్ మీరు మా సమస్యలను తీరుస్తారా అంటూ కామెంట్ పెట్టగా హా భాగు చేస్తా మరి నన్ను ఓటు వేసి సీఎం గా గెలిపించండి అంటూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియా నుండి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ హవా నడుస్తోంది. ఎన్నో టీవీ షోలు చేస్తూ ప్రస్తుతం అష్షు ఫుల్ బిజీగా కనిపిస్తోంది.