బాలీవుడ్ మరో షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇప్పటికే యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతుంటే అలాంటి చేదు వార్తనే మళ్లీ వినాల్సి వచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సిద్దార్థ్ శుక్లా ఈ రోజు గుండె పోటుతో మరణించారు. సిద్దార్థ్ హమ్టీ షరమ్ కి దుల్హానియా సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సహాయ నటుడిగా ఎంతో ఆకట్టుకున్నాడు. సిద్దార్థ్ నిద్రలో తీవ్రమైన గుండె పోటు రావడంతో మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఎంతో ఫిట్ గా కనిపించే సిద్దార్థ్ శుక్లా గుండె పోటుతో మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.