పవన్ నటించిన మొదటి సినిమా ఏదీ అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అని చెప్తారు ఆయన అభిమానులు.అయితే ఈ సినిమా కంటే ముందే పవన్ తన గొంతుని ఒక సినిమాలో వినిపించారట.కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు సినిమాలో పాటలు పాడటం, వాయిస్ ఓవర్ ఇస్తుండటం చేస్తుంటాడు పవన్.అయితే హీరో కాకముందే అప్పట్లో పవన్ ఓ సినిమాకి తన గొంతుని వినిపించాడు.అదికూడా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కావడం విశేషం.