కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ సినిమాకి షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఫిల్మ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను పూణే లో ప్రారంభించారట మేకర్స్.ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది.అది కూడా తండ్రీ ,కొడుకులు గా కనిపించనున్నారని అంటున్నారు.ఇక త్వరలోనే హీరోయిన్ నయనతార సైతం ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్టు సమాచారం.