టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ ఇప్పటిది కాదు. జయమాలిని, జ్యోతిలక్ష్మి ల కాలం నుండి ఐటమ్స్ సాంగ్స్ కు ఐటమ్ భామలకు ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఈ క్రేజ్ మెల్లి మెల్లిగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ లు ఐటమ్ సాంగ్స్ కు స్టెప్పులు వేసేవారు కారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఐటమ్ సాంగ్స్ చేసే వారికి ఇండస్ట్రీలో ఆదరణ తగ్గిపోగా ఇప్పుడు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి ఐటమ్ పాటలకు స్టెప్పులు వేయడంతో అసలు ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు స్పెషల్ అంటూ ఎవరూ లేకుండా పోయారు.