టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన 'కార్తికేయ' సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.అయితే ఈ సినిమా దర్శకనిర్మాతలు ఈ సినిమా సీక్వెల్ చేస్తామని చెప్పారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన తరువాతి షెడ్యూల్ ను గ్రీస్ దేశం లో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది.ఇప్పటికే దీనికి సంబంధించిన లొకేషన్ కూడా ఫిక్స్ చేసారట.