మా ఎన్నికల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీలను ప్రకటించాలంటూ గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కృష్ణంరాజు కు లేఖలు రాస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం మా ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖ రాశాడు. ఇక ఎట్టకేలకు అక్టోబర్ 10 నుండి మా ఎన్నికలను జరుపుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎన్నికల తేదీని ప్రకటించడంతో మా ఎన్నికల పై మరింత ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రకాష్ రాజ్ సిని మా బిడ్డలు అనే పేరుతో తన ప్యానల్ ను మరియు అందులోని సభ్యులను ప్రకటించాడు. ప్యానల్ లో ప్రకాష్ రాజ్ (అధ్యక్షుడు), నాగి వీడు (ట్రెజరర్), హేమ, బెనర్జీ (ఉపాధ్యక్షులు), జీవితా రాజశేఖర్ (జనరల్ సెక్రెటరీ), శ్రీకాంత్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) అనితా చౌదరి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రభాకర్, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సుడిగాలి సుదీర్, సుబ్బరాజు, సురేష్ కొండేటి ఉన్నారు. కాగా సినిమా బిడ్డలు ప్యానెల్ లో వీరిని సభ్యులుగా తీసుకోవడానికి కారణమేంటో ప్రకాష్ రాజ్ వివరించారు.