గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఓసారి ఎక్సైజ్ శాఖ పలువురు సెలబ్రిటీలను విచారించింది. దాంతో నింధితులను ఎక్సైజ్ శాక ప్రకటిస్తుందని అనుకున్నప్పటికీ తర్వాత ఈ కేసు ముందుకు వెళ్లలేదు. కానీ డ్రగ్స్ వ్యవహారంలో నైజీరియన్ కెల్విన్ ను నింధితుడిగా గుర్తించి అరెస్ట్ చేసింది. ఇప్పుడు కెల్విన్ కూడా తన వద్దనుండి నగరంలోని పలు పబ్ లకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో స్పష్టం చేశాడు. ఇక ఇప్పుడు మళ్లీ తాజాగా ఈ కేసు ఈడీ చేతికి వెళ్లింది. దాంతో ప్రస్తుతం ఈడీ టాలీవుడ్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై విచారణ కొనసాగిస్తోంది. 12 మంది సెలబ్రెటీలకు ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.