పవన్ 30 వ సినిమా తనకు అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయనున్నట్లు తెలుస్తోంది.త్రివిక్రమ్ దగ్గర పవన్ కి సరిగ్గా సూట్ అయ్యే ఓ కథ ఉంది. దానికి పవన్ కూడా ఓకే చెప్పడం జరిగింది.అయితే దీనిని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనేది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సమర్పణలో 'హారికా హాసిని క్రియేషన్స్ 'వారు ఈ కాంబోని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.