మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇద్దరూ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇటీవలే చరణ్ తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో మొదటి గెస్ట్ గా వచ్చి ఆర్ ఆర్ ఆర్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సంధర్బంగా ఇద్దరూ సరదాగా అనేక అంశాలపై చర్చించారు. ఈ షోలో ఎన్టీఆర్ హోస్ట్ చరణ్ గెస్ట్ కావడంతో టీఆర్పీ కూడా ఓ రేంజ్ లో వచ్చింది. కాగా ఎన్టీఆర్ షో కోసం రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి సందడి చేయగా ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడట. రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.