బిగ్ బాస్ సీజన్- 4 కు వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్-5 పై మరింత ఆసక్తి నెలకొంది. దాంతో ఎప్పటి నుండో తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజ్ 5 కోసం ఎదురుచఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎన్నో అంచానాల మధ్య ఈ రోజు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఎంతో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 5 ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముందు నుండి వాళ్లు హౌస్ లోకి వెళ్తున్నారు..వీళ్లు వెళుతున్నారంటూ కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కరోనా మరియు ఇతర కారణాల వల్ల చివరిగా కొంతమంది ఇంటి సభ్యుల జాబితా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ లో మొత్తం పదహారు మంది సభ్యులు హౌస్ లోకి వెళుతున్నట్టు సమాచారం. అలా హౌస్ లోకి వెళ్ళబోతున్నవారిలో యూట్యూబర్లు, సీరియల్ నటి నటులు, సినిమా తారలు ఉన్నారు.