కొన్ని సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుండనిపిస్తుంది...కానీ కొన్ని సినిమాల రీమేక్ లను చూస్తే ఎందుకు రీమేక్ చేసారా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి జాను. ఈ సినిమా తమిళంలో 96పేరుతో విడుదలైంది. 1996వ పదోతరగతి బ్యాచ్ ఆ బ్యాచ్ లోని అమ్మాయితో ప్రేమలో పడటం..ఆ తరవాత ఎవేవో కారణాల వల్ల ఇద్దరూ కలుసుకోలేకపోవడం..చివరికి గెట్ టూ గెథర్ లో కలుసుకుని బాధపడటం. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మరియు మరిన్ని సినిమాలు 96 సినిమా లాంటివే..అయితే సినిమా కథ రొటీన్ అయినా చూసేందుకు మాత్రం 96 ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు త్రిష తన నటన హావ భావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు.