ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-5 నిన్న ఆదివారం నాడు గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ప్రారంభంతోనే షోలో కంటెస్టెంట్ లపై షో పై సోషల్ మీడియాలో ట్రోల్స్..మీమ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే షోలో కంటెస్టెంట్ గా వచ్చిన లోబో గతంలో బిగ్ బాస్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లోబో.... ఇంటర్వ్యూలో యాంకర్ మీరు బిగ్ బాస్ షో కి వెళ్తున్నారంట అని ప్రశ్నించడంతో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ అది ఒక చెత్త షో.... అది నాకు కప్ ఆఫ్ టీ కాదని వ్యాఖ్యానించాడు. లోబో ఆగ్రహం చూసి అంతా అస్సలు బిగ్ బాస్ కు రాడని అనుకున్నారు.