బిగ్ బాస్ సీజన్ 5 ఫుల్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. గత సీజన్ ల కంటే ఈ సీజన్ లో గ్లామర్ డోస్ ను నిర్వాహకులు మరింత పెంచారు. బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో సరయు, శ్వేత వర్మ, లహరి, శిరీష, హమీదా లు ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వీరందరికీ లేని క్రేజ్ శైలజ ప్రియాకు కనిపిస్తోంది. శైలజ ప్రియ సినిమాలలో అక్క..వదిన క్యారెక్టర్ లు చేసి టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాంకుడా టీవీ సీరియల్స్ లో నటిస్తూ టీవీ ప్రేక్షకులను సైతం ప్రియా సంపాదించుకుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే శైలజా ప్రియాకు యూత్ లో అభిమానులు ఉండటం మరో ఎత్తు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయిన ప్రగతి, సురేఖ వాణికి హీరోయిన్ లకుఉన్న రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదే రేంజ్ ఫాలోయింగ్ ప్రియా కు ఉన్నట్టు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.