టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాస్త కోపం ఎక్కువే అని టీవీ షోలలో యాంకర్స్ అంటుంటారు. విశ్వక్ కూడా తన సినిమాలపై ట్రోల్స్ వస్తే విరుచుకుపడతారు. లైవ్ లోకి వచ్చి కడిగేస్తుంటారు. తన జోలికి వచ్చినా విశ్వక్ సేన్ రియాక్షన్ అలాగే ఉంటుంది. అప్పట్లో ఓ యూట్యూబ్ చానల్ పెట్టిన థంబ్ నెయిల్ నచ్చకపోవడంతో విశ్వక్ సేన్ ఆ థంబ్ నెయిల్ తీసేయకపోతే ఇంటికి వచ్చి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటీవల విశ్వక్ సేన్ పాగల్ అనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా..పేరు గుర్తుంచుకోండి విశ్వక్ సేన్ అంటూ మైక్ పట్టుకుని రెచ్చి పోయారు. ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమా వేరే లెవల్ లో ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమా విడుదలతో కొన్ని థియేటర్లు తెరుచుకున్న మాట వాస్తవమే కానీ అవి పాగల్ కోసమే తెరుచుకున్నాయని చెప్పలేం.